శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ గత 25 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉగాది పర్వదినాన శ్రీకళాసుధ సంస్థ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలను అందించనుంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘చెన్నైలో ఈ పురస్కారాల్ని అందజేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్‌గారు, మండలి బుద్ధప్రసాద్, అలీ, పి.సుశీల, నిర్మాత రవిశంకర్ హాజరవుతారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుక నిర్వహిస్తాం. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గీత రచయిత చంద్రబోస్‌కు సత్కారం చేయబోతున్నాం. నిర్మాత రమేష్ ప్రసాద్‌గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేయబోతున్నాం’ అన్నారు.