తీజ్ వేడుకలో బుట్టబొమ్మలా మారిన కాజల్.. పిక్స్ వైరల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ 35 ఏళ్ల వయస్సులోను తన అందచందాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెళ్లైన తర్వాత కూడా ఈ అమ్మడి హవా ఏ మాత్రం తగ్గలేదు. ‘ఉమ’, ‘ఘోస్టీ’, ‘కరుంగాప్పియమ్’, ‘హే సినామిక’ షూటింగ్‌లను పూర్తి చేసిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’, నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ పెళ్లయ్యాక సినిమాలు చేయదు అని అనుకున్నారు. కాని ఇప్పుడు ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఉమ చిత్రంలో డిఫరెంట్ రోల్ ప్లే చేసిన కాజల్.. నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో వేశ్యగా కనిపించనుందట. ఆ పాత్ర కాజల్ చేస్తుందని అనే సరికి అంతా అవాక్కయ్యారు.
గత ఏడాది అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ వైవాహిక జీవితం సంతోషంగా గడుపూతూనే సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది.అయితే నార్త్‌లో తమ దాంపత్య జీవితం బాగుండాలని ‘హర్యాలీ తీజ్’ (భర్త ఆయురారోగ్యాల కోసం పెళ్లయినవాళ్లు, మంచి భర్త రావాలని పెళ్లి కాని అమ్మాయిలు నార్త్‌లో జరుపుకునే పండగ) ఫెస్టివల్‌ను జరుపుకుంటూ ఉంటారు.
తాజాగా ఆ పండుగను తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేసుకుంది కాజల్.గ్రీన్ డ్రెస్‌లో ఎంతో అందంగా రెడీ అయిన కాజల్ బుట్టబొమ్మలా కనిపిస్తుంది. పండగ రోజంతా కాజల్ ఉపవాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పండగకి సంబంధించిన ఫొటోలను కాజల్ తన ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘ఫస్ట్ తీజ్.. హర్యాలీ తీజ్’ అనే కామెంట్ పెట్టింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- festival
- kajal aggarwal
- tej
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

