పద్నాలుగో వారం బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన కాజల్ తనకు హౌజ్‌మేట్స్‌పై ఉన్న అభిప్రాయాలు వెల్లడించింది. సన్నీ ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని పేర్కొంది. సన్నీ పక్కన ఉంటే నవ్వుకుంటూనే ఉంటాం అని తెలియజేసింది. మొదటి రోజు మానస్ ఫ్రెండ్ అయ్యాడు.. ఎలిమినేట్ అయ్యే వరకు నా ఫ్రెండ్‌లానే ఉన్నాడు అని మానస్ గురించి కాజల్ చెప్పింది.
ఇక శ్రీరామచంద్రకు యాక్షన్ అనే ట్యాగ్ ఇచ్చింది. ప్రతీది పక్కా ప్లాన్‌తో చేస్తాడు.. అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాడు.. చాలా మంచివాడు..జెన్యూన్ పర్సన్ అని శ్రీరాచంద్ర గురించి కాజల్ మొదటిసారిగా మంచిగా చెప్పింది. సిరి ఐదు రెట్ల ఎమోషన్ అంటూ కాజల్ చెప్పింది. ఏది కూడా మనసులో దాచుకోదు బయట పెట్టేస్తుందని పేర్కొంది కాజల్. హగ్గులు కూడా ఇస్తుంది కదా? అని నాగార్జున వెళ్లి కాజల్‌ను హగ్ చేసుకుంటాడు.
అవును సర్ సిరి హగ్గులు కూడా ఇస్తుంటుందని కాజల్ చెబుతుంది. ఇక అన్నింట్లోనూ డ్రామా ఉంటుందని, సిరిని బాగా కంట్రోల్ చేస్తాడంటూ షన్ను గురించి కాజల్ చెప్పింది. ఇక కాజల్ వెళ్తే ఇంట్లో గొడవలు తగ్గుతాయని అన్నావ్ కదా? ఇప్పుడు ఇంట్లో గొడవలు ఉండవా? అని షన్నుని నాగ్ ఇరికించాడు. ఇంట్లో జరిగిన అన్ని గొడవలకు ఎక్కడో ఒక చోట మూలం మాత్రం తానే అయి ఉంటానని కాజల్ ఒప్పుకుంది.అవి కావాలని చేసినవి కావని తెలివిగా చెప్పి తప్పించుకుంది.