టాలీవుడ్ (Tollywood) కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మను చరిత్ర (Manu Charitra) సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివ కందుకూరి (Shiva Kandukuri), మేఘా ఆకాశ్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీ వాత్సవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. మనుచరిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
హైదరాబాద్‌లోని పెద్దమ్మ టెంపుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంతో మనుచరిత్ర చిత్రీకరణ పూర్తయింది. చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ ఏడాది చివరలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్త డైరెక్టర్ భరత్ పెడగాని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యాపిల్ ట్రీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు.
గోపీసుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. మేకర్స్ త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ నిర్మాతగా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.
ఇది కూడా చూడండి
jagapathi babu: బాలీవుడ్‌పై కన్నేసిన జగపతి బాబు.. !
Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమల్..‘రొమాంటిక్’ గా ట్రైలర్
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!