లక్ష్మీ కల్యాణం సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఆ తర్వాత కెరీర్లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా మారింది. ఈ భామ బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu) ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సక్సెస్ ఫుల్గా ఆచార్య సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ప్రస్తుతం పండంటి బిడ్డ కోసం కళ్లు కాయలు చేసేలా ఎదురుచూస్తోంది. నెట్టింట్లో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీకి సోషల్ మీడియా (Instagram)లో ఫాలోవర్ల సంఖ్య 21 మిలియన్లకు చేరింది.
ఈ సందర్భంగా తన ఫాలోవర్లకు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. 21 మిలియన్ల మంది ఇన్ స్టా గ్రామ్ కుటుంబసభ్యుల ప్రేమకు ధన్యవాదాలు. నేను కూడా 21 మిలియన్ల స్థాయిలో తిరిగి ప్రేమ కురిపిస్తూ..ఇన్ స్టాగ్రామ్లో రెడ్ లెహంగ, మ్యాచింగ్ చోలీ డ్రెస్లో సందేశాన్ని పోస్ట్ చేసింది. సెల్ఫ్ ఎంబ్రాయిడరీ లెహంగా, కట్ డిజైన్డ్ నెట్ దుపట్టాలో హొయలు పోతూ కెమెరాకు ఫోజులిచ్చింది.
గ్లామరస్ మేకప్ లుక్లో ఓపెన్ హెయిర్ లుక్లో సిల్వర్ హీల్స్ వేసుకున్ను కాజల్ ధగ ధగ మెరిసిపోతూ నెటిజన్ల మతులు పోగొడుతుంది. కాజల్ నటించిన ఆచార్య త్వరలో విడుదల కానుంది. మరోవైపు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి హే సినామిక చిత్రంలో నటిస్తోంది. అదితీ రావు హైదరి కీ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం మార్చి 3న విడుదల కానుంది.