Tamannaah | 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’తో తెరంగేట్రం చేసింది మిల్కీబ్యూటీ తమన్నా. అదే ఏడాది మనోజ్ ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. మొత్తంగా 19ఏళ్ల కెరీర్ని పూర్తి చేసుకుంది తమన్నా. దాంతో తమన్నాపై అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటి కాజల్ కూడా మిల్కీబ్యూటీకి శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు ఎడిట్చేసిన తమన్నా పోస్టర్ను తన వ్యక్తిగత సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది. దానిపై తమన్నా స్పందించింది.
‘నా కెరీర్ ఇంత హాయిగా సాగుతోందంటే కారణం నీ స్నేహం. ఇన్నేళ్లు నాకెంతో మద్దతుగా నిలిచావు. హద్దులు లేని ప్రేమను పంచావు. థాంక్యూ కాజూ..’ అంటూ రిప్లయ్ ఇచ్చింది తమన్నా. ఇంకా చెబుతూ ‘ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకోగలిగాను. వారి ఉత్సాహమే నాలో శక్తిని రెట్టింపు చేస్తున్నది. రానున్న కాలం ప్రేమతో నిండిన లెక్కలేనన్ని జ్ఞాపకాలకు వేదిక కానుంది. మీ అందరికీ నచ్చే సినిమాలే చేస్తానని హామీ ఇస్తున్నా’ అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది తమన్నా.