టాలీవుడ్ (Tollywood) కలువ కళ్ల సుందరి కాజల్ (Kajal Aggarwal) సోదరిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నిషా అగర్వాల్ (Nisha Aggarwal). ఏమైంది ఈ వేళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఆ తర్వాత సోలోతోపాటు పలు చిత్రాల్లో నటించిన నిషా పెండ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. నిషా అగర్వాల్ పుట్టినరోజు (birthday) సందర్భంగా సోదరికి శుభాకాంక్షలు తెలియజేసింది కాజల్. ఇంటి బాల్కనీపై సరదాగా హమ్ చేస్తున్న స్టిల్‌తోపాటు కాజల్ తన వెడ్డింగ్ సమయంలో నిషా దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చే\స్తూ విషెస్ చెప్పింది.
అత్యంత దయగల, అందమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టింది కాజల్.
నువ్వు నా చెల్లెలు అని పిలవడం నాకు చాలా గర్వంగా ఉంది. నీ హృదయం ప్రేమ, కృతజ్ఞత, ఆనందం, పెరుగుదల, పురోగతితో నిండి ఉంటుంది. జీవితం అందించే ఉత్తమ అనుభవాలను నువ్వు పొందాలి..లవ్ యు మై బేవీ అంటూ పుట్టినరోజు సందేశంలో పేర్కొంది కాజల్.
ఇది కూడా చూడండి
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి