Kajal Agarwal | టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. ఇటీవలే ఈమె మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్, గౌతమ్ కిచ్లూల కొడుకుకు నీల్ కిచ్లూ అనే పేరును పెట్టారు. మదర్స్ డే సందర్భంగా తాజాగా కాజల్ తన బిడ్డతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ స్టోరీని రాసింది. నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు, నువ్వే నా నక్షత్రాలన్ని అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

