సినీ తారలు అప్పుడపుడు కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సాయం చేయడం చూస్తూ ఉంటాం. తాజాగా టాలీవుడ్ కలువు కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గొప్ప మనసు చాటుకుని ఓ విద్యార్థినికి అండగా నిలిచింది. హైదారాబాద్‌కు చెందిన ఎం ఫార్మసీ విద్యార్థిని సుమ తన కాలేజీ ఫీజును చెల్లించాలని ట్విటర్ ద్వారా కాజల్‌అగర్వాల్ ను కోరింది. తాను ఇటీవలే ఉద్యోగం పోగొట్టుకున్నానని చెప్పిన సుమ..ఎం ఫార్మసీ ఎగ్జామినేషన్ వెళ్లాలంటే రూ.83,000 చెల్లించాల్సి ఉందని కాజల్ దృష్టికి తీసుకెళ్లింది.
దీనిపై కాజల్ ప్రతినిధి ఒకరు సుమను సంప్రదించి ఆమె ఖాతాకు రూ. 1 లక్ష రూపాయలు పంపించిందట కాజల్. ఆర్థిక భారంతో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థిని సుమకు సాయం చేసిన కాజల్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తోంది కాజల్.