హైదరాబాద్: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ఈ పాట వినని సినీ అభిమాని ఉండరు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి చిత్రంలోనిది ఈ సాంగ్. స్నేహితుల మధ్య ఉండే బంధాన్ని గొప్పగా చెప్పిన చిత్రం అది. అయితే ఆ ఫిల్మ్‌లో కైకాల సత్యనారాయణ కీలక పాత్ర పోషించాడు. ఎన్టీఆర్‌కు మిత్రుడిగా చేశాడు. ఇక స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం సాంగ్ ఆ సినిమాకే హైలైటె్. ఆ పాటలో కైకాల నటనా కౌశలం మరో అద్భుతం. స్నేహ గీతానికి సత్యనారాయణ తన డ్యాన్స్ శైలితో వన్నెతెచ్చారు. టాలీవుడ్లో ఆ నాటి రోజుల్లో ఇదో చార్ట్‌బస్టర్.
అమితాబ్ నటించిన హిందీ సూపర్‌హిట్ ఫిల్మ్ జంజీర్ ఆధారంగా నిప్పులాంటి మనిషి సినిమాను తీశారు. నిజానికి అమితాబ్ నటించిన చాలా చిత్రాలను సీనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేశారు. కానీ ఈ ఫిల్మ్‌లో ఉన్న స్నేహమేరా జీవితం సాంగ్ ఎవర్గ్రీన్. ఎంతో ఉత్సాహాన్ని నింపే ఈ సాంగ్‌లో సత్యనారాయణ తన యాక్టింగ్‌తో విమర్శకులను కూడా ఆకట్టుకున్నారు. సినారే అందించిన అద్భుత సాహిత్యాన్ని.. తన హావభావాలతో కైకాల స్క్రీన్ ముందు ప్రదర్శించిన తీరు అనిర్వచనీయం.
పఠాన్ గెటప్‌లో సత్యనారాయణ .. ఓరిజినల్ సాంగ్‌కు తీసిపోని రీతిలో నటించారు. జంజీర్లో ఈ పాత్రను మెగా విలన్ ప్రాణ్ పోషించాడు. ప్రాణ్‌కు ధీటైన రీతిలో.. నిజానికి అంతకన్నా మెరుగైన రీతిలో కైకాల నటించారు. ఆ ఖవాలీ సాంగ్ వీడియోను మీరూ ఎంజాయ్ చేయండి..