Drugs Case | డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరి సంచలన వ్యాఖ్యలు
Drugs Case | డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ ఇండస్ట్రీలో కలవరం మొదలైంది. కేపీ చౌదరి గోవా నుంచి తీసుకొచ్చిన 100 ప్యాకెట్ల కొకైన్లో 90 ప్యాకెట్లు మాత్రమే పోలీసులకు దొరికాయి. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
Drugs Case | డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ ఇండస్ట్రీలో కలవరం మొదలైంది. కేపీ చౌదరి గోవా నుంచి తీసుకొచ్చిన 100 ప్యాకెట్ల కొకైన్లో 90 ప్యాకెట్లు మాత్రమే పోలీసులకు దొరికాయి. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కేపీ చౌదరికి టాలీవుడ్లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు హీరోయిన్స్, ఇద్దరు నిర్మాతలకు కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేపీ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా వాళ్లు ఎవరికీ డ్రగ్స్ సప్లై చేయలేదని స్పష్టం చేశారు.
తాను డ్రగ్స్ తీసుకుంటానని ఒప్పుకున్న కేపీ చౌదరి.. పట్టుబడిన మాదక ద్రవ్యాలు తన కోసమే తెచ్చుకున్నా అని స్పష్టం చేశారు. తన ఫోన్లో సెలబ్రెటీల ఫొటోలు ఉన్నాయని తెలిపారు. ఫోన్లో నంబర్లు ఉన్నంత మాత్రాన తాను పెడ్లర్ని కాదని అన్నారు. సెలబ్రెటీలు ఎవ్వరికీ తాను డ్రగ్స్ ఇవ్వలేదని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. కాగా డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి కస్టడీ పూర్తయ్యింది. రెండు రోజుల పాటు విచారించిన రాజేంద్రనగర్ పోలీసులు.. శుక్రవారం నాడు రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

