Kaalidhar Laapata | బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కాళిధర్ లపతా’. దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మధుమిత దర్శకత్వం వహించగా.. జీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో జూలై 4న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఒక వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. తన కుటుంబం తనను వదిలించుకోవాలని అనకుంటుందని తెలుసుకున్న ఆ వృద్ధుడు ఇంటి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో, అతనికి ఎనిమిదేళ్ల అనాథ అయిన బల్లుతో ఊహించని పరిచయం అవుతుంది. అయితే బల్లు పరిచయం అయ్యాకా అతడి జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా కథ.
चर्चाओं पर अब फुल स्टॉप!
Sometimes, getting lost isn’t a detour, it’s where the real story begins.
Full of dreams, twists, and the people who make it worth it. 😊#KaalidharLaapata premieres 4th July, only on #ZEE5.#KaalidharLaapataOnZEE5@Mdzeeshanayyub #DaivikBaghela… pic.twitter.com/0BDqAumEUR— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) June 19, 2025