K Vijaya Bhaskar| టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే. విజయ్ భాస్కర్ అంటే ఇప్పుడున్న జనరేషన్ గుర్తుపట్టకపోవొచ్చు కానీ 90స్ కిడ్స్ ఇట్టే గుర్తుపడతారు. ‘నువ్వే కావాలి’, ‘మన్మథుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘జై చిరంజీవ’ లాంటి ఆల్‌టైమ్ ఫ్యామిలీ బ్లాక్బస్టర్లను టాలీవుడ్‌కు అందించాడు విజయ్ భాస్కర్. ఇక ఈయన సినిమాలోని మూవీ సన్నివేశాలను ప్రస్తుత జనరేషన్ మీమ్స్ (Memes) కింద వాడేస్తుంది. ఇదిలా ఉంటే.. విజయ్ భాస్కర్ మళ్లీ మెగా ఫోన్ పడుతున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఉషాపరిణయం'(Usha parinayam). లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాలో విజయ్ భాస్కర్ కొడుకు శ్రీకమల్ హీరోగా నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేయగా.. చాలా కలర్ఫుల్గా ఉంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి ‘ఉషా’ను నవంబర్ 24న పరిచయం చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ సినిమాలో శ్రీకమల్తో పాటు తాన్వీ ఆకాంక్ష, సూర్య, అలీ, వెన్నెలకిషోర్, శివాజీరాజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా విజయ్ భాస్కర్ చేపడుతున్నారు.
A whispered Promise in the silence of Understanding 💖
Revealing “ఉషాపరిణయం” 💞
A Vijaya Bhaskar Kraft.Written, Produced & Directed by #VijayaBhaskarK
Shoot Begins Soon 🔜
DOP #SatishMutyala 🎥
Music #RRDhruvan 🎹#UshaParinayam pic.twitter.com/T3CMShJ2Ru— Ramesh Bala (@rameshlaus) November 21, 2023
Who is Usha? 🧐
Guess the lady lead of #UshaParinayam 🤩, official reveal on Nov 24th! ♥️
“ఉషాపరిణయం” 💞 ~ A Vijaya Bhaskar Kraft.
Written, Produced & Directed by #VijayaBhaskarK
Shoot Begins Soon 🔜
DOP #SatishMutyala 🎥
Music #RRDhruvan 🎹 pic.twitter.com/jlbOmKpRsq— Ramesh Bala (@rameshlaus) November 22, 2023
ఇక విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం జిలేబీ (JILEBI 2023). ఈ సినిమాతో శ్రీకమల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శివాని రాజశేఖర్ హీరోయిన్గా నటించింది. జూలైలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.