K Ramp | టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇటీవలే కే-ర్యాంప్ (K Ramp) సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడని తెలిసిందే. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ జైన్స్ నాని తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
కాగా థియేటర్లలో మిస్సయిన వారి కోసం కే ర్యాంప్ డిజిటల్ స్ట్రీమింగ్ కూడా అవుతుంది. కే ర్యాంప్ ప్రస్తుతం పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. తాజాగా కే ర్యాంప్ హిందీ వెర్షన్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. తాజా అప్డేట్తో సినిమాపై అటెన్షన్ మరింత పెరిగిపోతుంది. జియో హాట్ స్టార్ తాజాగా కే-ర్యాంప్ హిందీ వెర్షన్‌ను యాడ్ చేసింది. మరి నార్త్ ఆడియెన్స్ కే ర్యాంప్ హిందీ వెర్షన్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
కే ర్యాంప్‌లో యుక్తి తరేజా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా..సాయికుమార్, నరేశ్ వి.కె., కామ్నా జెఠ్మలానీ, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. కే-ర్యాంప్ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేశ్ దండా, శివ బొమ్మక్కు నిర్మించారు.
KRamp Hindi Version Now Airing on @JioHotstar ❤#KiranAbbavaram #KRamp pic.twitter.com/eZfsmWBh7B
— Actor_KiranAbbavaram (@Actor_KA_) December 14, 2025