K Ramp Movie Producer | కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ సినిమాకు ఒక తెలుగు వెబ్సైట్ కావాలని నెగిటివ్ రివ్యూలు ఇచ్చిందని చిత్ర నిర్మాత రాజేష్ దండా ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై మరోసారి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తాను కోపంతో మాట్లాడాల్సి వచ్చినప్పటికీ, తన పోరాటం మొత్తం ‘తెలుగు 360’ అనే ఒక వెబ్సైట్పైనే తప్ప, మొత్తం మీడియా సంస్థలు లేదా జర్నలిస్టులపై కాదని ఆయన స్పష్టం చేశారు.
నిర్మాతగా, పంపిణీదారుగా నేను మీడియా మిత్రులతో ఎలాంటి గౌరవ మర్యాదలతో ఉంటానో అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఒక వెబ్సైట్ నిర్వాహకుల పట్ల పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి నేను కే ర్యాంప్ సినిమా తీశాను. తెలుగు 360 అనే ఒక వెబ్సైట్ దానికి రివ్యూ ఇచ్చింది. అది నాకు అభ్యంతరం కాదు. కానీ, సినిమాను జనం ఆదరిస్తున్నారు, ఆ విధంగా సినిమా హిట్ అయితే వారి సమీక్షల విశ్వసనీయత (Credibility) పోతుందని భావించి, వాళ్లు తమ రేటింగ్‌ను నిలబెట్టుకోవడానికి నా సినిమా మీద నెగటివ్ పోస్టులు, నెగటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు.
గతంలో ‘మ్యాడ్ 2’ సినిమా విషయంలో కూడా ఇదే విధంగా జరిగితే, నిర్మాత నాగవంశీ ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారని, తమపై ఆధారపడి వెబ్సైట్లు నడుపుతూ ఇలా చేయడం తప్పు అని అప్పుడే ఆయన చెప్పారని రాజేష్ దండా గుర్తు చేశారు. ఇప్పుడు నేను అదే చెబుతున్నాను. నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు. కానీ, కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ, నాకు కోట్లాది రూపాయల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా? నేను కూడా మనిషినే కదా. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. అంతకు మించి మరే మీడియా సంస్థ మీద, మరే మీడియా వ్యక్తి మీద నాకు ఏ కోపం లేదు. 150 మందికి పైగా ఉన్న సినిమా జర్నలిస్టులు, సోషల్ మీడియా జనాలు, మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులు. వారంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. తన బాధ, కోపం నుంచి వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన విజ్ఞప్తి చేశారు. తన యుద్ధం మీడియా మీద కాదని, మీడియా ముసుగులో సినిమాలను చంపుతున్న తెలుగు 360 వెబ్సైట్ మీద మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
మీడియా మిత్రులకు, మీడియా సంస్థలకు విన్నపం.
నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు…
— Razesh Danda (@RajeshDanda_) October 22, 2025