K Bhagyaraj | తమిళ సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత
K Bhagyaraj | తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. దాదాపు ఐదు దశాబ్దాలపాటు తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఆయన మరణ వార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
K Bhagyaraj | తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. దాదాపు ఐదు దశాబ్దాలపాటు తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఆయన మరణ వార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఇటీవల ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణంతో విషాదంలో ఉన్న తమిళ చిత్ర పరిశ్రమకు, ఇప్పుడు కె. భాగ్యరాజ్ మరణం తీరని లోటుగా మారింది. ప్రత్యేకమైన కథలు, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలు, వినోదాత్మక కథనాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న భాగ్యరాజ్ ఇక లేరనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, కె. భాగ్యరాజ్‌కు శుక్రవారం రాత్రి అస్వస్థతకి లోనయ్యారు. అనంతరం ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలబెట్టలేకపోయినట్లు సమాచారం. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కె. భాగ్యరాజ్ తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రత్యేకమైన రచయిత-దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కుటుంబ కథలు, ప్రేమ, హాస్యం, సామాజిక అంశాలను సమతుల్యంగా మిళితం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉండేది.
ఆయన సినిమాల్లో కనిపించే మధ్యతరగతి కుటుంబాల కథలు, సహజమైన పాత్రలు, చమత్కారమైన సంభాషణలు, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయి. సాధారణ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను కూడా ఆసక్తికరమైన కథలుగా మలచడంలో ఆయన దిట్ట. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ కె. భాగ్యరాజ్ మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన పోషించిన పాత్రలు సాధారణ మనుషుల జీవితాలకు దగ్గరగా ఉండేవి. లోపాలు ఉన్నప్పటికీ మనసుకు దగ్గరగా అనిపించే పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. 1979లో విడుదలైన ‘సువరిల్లాధ చిత్రంగళ్’ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన భాగ్యరాజ్, తొలి సినిమాతోనే తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. కె. భాగ్యరాజ్‌కి భార్య పూర్ణిమ జయరామ్, కుమార్తె శరణ్య భాగ్యరాజ్, కుమారుడు మరియు నటుడు శాంతను భాగ్యరాజ్ ఉన్నారు.
భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ప్రముఖ చిత్రాల్లో సువరిల్లాధ చిత్రంగళ్ (1979), ఒరు కై ఒసై (1980), మౌన గీతంగళ్ (1981), అంధా 7 నాట్కల్ (1981), డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ (1982), ముంధనై ముడిచ్చు (1983), ధావణి కనవుగల్ (1984), చిన్న వీడు (1985), ఎంగా చిన్న రాసా (1987), అవసర పోలీస్ 100 (1990) చిత్రాలు తమిళ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

