Rahul Dev | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ రాహుల్ దేవ్. ఆకాశ వీధిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఢిల్లీ యాక్టర్ సింహాద్రి, సీతయ్య, మాస్, అతడు సినిమాలతో సూపర్ పాపులారిటీ సంపాదించాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆంధ్రావాలా, సింహాద్రి, నరసింహుడు, దమ్ము సినిమాల్లో విలన్‌గా నటించాడు రాహుల్ దేవ్. తారక్ యాక్టింగ్‌పై రాహుల్ దేవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.
తెలుగు యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ మనందరికీ ఓ గిఫ్ట్ లాంటి వాడని, అతని స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ దేవ్ మాట్లాడుతూ.. తారక్ ఎక్స్ప్రెషన్స్, సహజత్వం అద్భుతమైన కామిక్ టైమింగ్, ఎనర్జీ ఉన్న బాలీవుడ్ యాక్టర్ గోవిందాను గుర్తుకు తెస్తుంది. చాలా మంది సమకాలీన యాక్టర్లలో అరుదైన జీనియస్ లెవల్ టాలెంట్ జూనియర్ ఎన్టీఆర్ సొంతమని ప్రశంసించాడు. రాహుల్ దేవ్ కామెంట్స్ చదివిన తారక్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్ఆర్ఆర్ స్టార్‌పై రాహుల్‌దేవ్ కామెంట్స్‌కు స్వాగతం పలికిన అభిమానులు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.
పాన్ ఇండియా పాపులారిటీని ఎంజాయ్ చేస్తూనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు తారక్.తెలుగులో చివరగా జాక్ సినిమాలో నటించిన రాహుల్ దేవ్ ప్రస్తుతం రెండు హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Rashmika | ‘మైసా’ కోసం రష్మిక కష్టాలు .. కాళ్లకు టేప్ వేసుకొని మరి..!
CM Vijay | త్వరలో మహిళలకు నెలకు రూ.1,000.. వెల్లడించిన తమిళనాడు సీఎం విజయ్