June 3rd Week Telugu Releases | వేసవి చివరి దశకు వచ్చింది. స్కూల్లు, కాలేజీలు ఓపెన్ అయిపోయాయి. ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్రలో ఒక సమ్మర్ సీజన్లో వినోదాల విందు లేకపోవడం బహుశా ఇదే తొలిసారేమో. సినీ ఇండస్ట్రీ వాళ్లు సమ్మర్ ను సినిమాల సీజన్ అని అంటుంటారు. పిల్లలకు హాలీడేస్ ఉండటంతో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూడడానికి వస్తుంటారు. ఇక సమ్మర్ లో విడుదలయ్యే సినిమాలకు కాస్త పాజిటీవ్ టాక్ వస్తే చాలు నిర్మాతలకు కామధేనువులా కనకవర్షం కురుస్తుంది. అలాంటిది ఈ సమ్మర్ మరీ చప్పగా సాగింది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆహా ఓహో అనే రేంజ్ లో రాలేదు. కాస్తో కూస్తో డబ్బింగ్ సినిమాలే ఈ సమ్మర్ లో ప్రేక్షకులకు వినోదాల విందును పంచాయి. ఇక ఇప్పుడు అందరి చూపు ఆదిపురుష్ పైనే ఉంది. సమ్మర్ తర్వాత విడుదల కాబోతున్న పెద్ద సినిమా ఇదే. ఒక్క తెలుగులోనే కాదు మిగితా భాషల్లో కూడా సమ్మర్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా ఇదే. యావత్ ఇండియా సినీ లవర్స్ అందరూ ఈ సినిమాపై అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇక థియేటర్లోనే కాకుండా ఈ వారం ఓటీటీలోనూ మంచి మంచి సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ వారం విడుదలయ్యే సినిమాలు/వెబ్ సిరీస్ లేంటో ఓ లుక్కేద్ధాం.
థియేటర్లో విడుదలయ్యే సినిమాలు:
ఆదిపురుష్:
రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రాండ్ లెవల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలు సినిమాపై తిరుగులేని హైప్ తెచ్చిపెట్టాయి. ఎప్పుడెప్పుడు ఆ అద్భుత దృష్ట్య కావ్యాన్ని చూద్దామా అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ఈ సినిమాలో కృతిసనన్ సీతాదేవిగా కనిపించనుంది. లంకాధిపతి రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు.
ది ఫ్లాష్:
సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా జూన్ 16న విడుదల కాబోతుంది. ‘డీసీ ఎక్స్ టెండెడ్ యూనివర్స్’ అనే సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమాకు అండీ ముషియెట్టి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. ఎజ్రా మిల్లర్ సూపర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఒకప్పుడు హాలీవుడ్ బ్యాట్మ్యాన్గా వెలుగొందిన మైఖల్ కీటన్ మళ్లీ బ్యాట్మ్యాన్గా అలరించనున్నాడు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు:
అమెజాన్ ప్రైమ్ వీడియో:
జీ కర్దా(హిందీ వెబ్ సిరీస్) – జూన్ 15
సోనీ లివ్:
ఫర్హాన (తెలుగు) – జూన్ 16
నెట్ ఫ్లిక్స్:
ఎక్సట్రాక్షన్ 2 (హాలీవుడ్ మూవీ)– జూన్ 16
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
సైతాన్(తెలుగు వెబ్ సిరీస్) – జూన్ 15
బిచ్చగాడు-2 (సినిమా) – జూన్ 17
జియో సినిమా:
ఐ లవ్ యు(హిందీ చిత్రం) – జూన్ 16