బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎలా అయితే పాన్ ఇండియా స్టార్‌గా మారాడో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్స్‌గా మారనున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్పటాకే రామ్ చరణ్ టాప్ డైరెక్టర్స్ తో కలిసి పని చేస్తుండగా, ఎన్టీఆర్ ఓ బాలీవుడ్ డైరెక్టర్‌తో పని చేయనున్నట్టు ప్రచారం నడుస్తుంది.
మన హీరోలు ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా విభిన్నమైన కథలను పై ఫోకస్ చేస్తున్నారు. కథ నచ్చితే దర్శకుడు ఏ భాష వారు అని కూడా చూడటం లేదు. ఈ క్రమంలో ఎన్టీఆర్ .. బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి ఎన్నో చారిత్రాత్మక కథలను టచ్ చేసిన సంజయ్ లీలా భన్సాలీతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు ప్రచారం నడుస్తుంది.
సంజయ్.. ప్రస్తుతం గంగు భాయ్ కథియావాడి సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో అలియాభట్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తోనే సంజయ్ మరో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో ఎన్టీఆర్‌తో కలిసి పని చేయనున్నట్టు ప్రచారం నడుస్తుంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజముందో..!
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం