ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ప్రస్తుతం ఈ స్టార్ యాక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ షురూ కానుంది. కాగా ప్రస్తుతం మరొక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. తారక్ రాబోయే రోజుల్లో కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) తో సినిమా చేసే అవకాశాలున్నట్టు ఓ అప్డేట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
తారక్, వెట్రిమారన్ సినిమా విషయంపై చర్చలు కూడా జరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుందట. అంతేకాదు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫస్ట్ పార్టులో జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్లో కనిపించనుండగా.. రెండో పార్టులో ధనుష్ ప్రధాన పాత్రలో నటించబోతున్నాడట. వెట్రిమారన్ ప్రస్తుతం సూర్యతో వాడివాసల్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా పూర్తవగానే తారక్, ధనుష్‌తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టనున్నట్టు ఇన్సైడ్ టాక్.బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఇండస్ట్రీలో ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు వెట్రిమారన్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఒకే అయితే మూవీ లవర్స్ కు మాత్రం పండగే అని చెప్పొచ్చు. మరి వెట్రిమారన్ తో సినిమా చేసే విషయంపై ఎన్టీఆర్ ఏదైనా స్పందిస్తాడేమోనని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.