JR Ntr | పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ముందుంటుంది. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, కేవలం నటనతోనే స్టార్డమ్ అందుకున్న తారక్ ..ఆది, సింహాద్రితో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని, యమదొంగ, రాఖీ, బృందావనం వంటి చిత్రాలతో తన నటనలో వెర్సటైలిటీని ప్రదర్శించాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన RRRతో ఎన్టీఆర్ గ్లోబల్ రేంజ్లో హవా చూపించాడు. కొమురం భీమ్ పాత్రలో ఆయన చూపించిన ఎమోషన్, ఇన్టెన్సిటీకి హాలీవుడ్ నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి.తర్వాత వచ్చిన దేవరతో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్న తారక్, ఇటీవల విడుదలైన వార్ 2 ఫలితంతో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు.
అయినప్పటికీ ఎన్టీఆర్ మార్కెట్, క్రేజ్, ఫ్యాన్బేస్పైన ఎలాంటి ప్రభావం లేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ తాజాగా చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యుయెల్లరీ యాడ్ సోషల్ మీడియాలో చర్చకు కేంద్రబిందువు అయింది. కొన్నేళ్లుగా ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తారక్, ఈసారి యాడ్‌లో పూర్తిగా కొత్త లుక్‌తో కనిపించాడు. గుబురుగా పెరిగిన గెడ్డం, కొద్దిగా సన్నబడిన శరీరం, కాస్త నీరసంగా కనిపించే షేడ్స్ ఇవన్నీ సాధారణంగా ఎనర్జిటిక్ లుక్‌లో కనిపించే ఎన్టీఆర్‌కు పూర్తిగా భిన్నంగా ఉండటంతో నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించాయి.
అయితే ఈ లుక్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంత మంది నెటిజెన్స్ .. ఈ లుక్ సెటవ్వలేదు అన్నా, హెయిర్ స్టైల్ అంత బాగోలేదు, గత యాడ్‌తో పోల్చితే ఇది డల్‌గా ఉంది అంటూ కామెంట్లు చేశారు. కొందరు అయితే హద్దులు దాటి మతపరమైన కోణంలో కూడా ట్రోలింగ్ ప్రయత్నం చేయడం అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. అయితే స్టార్ హీరోలు కొత్త సినిమా పాత్రలకు తగ్గట్టుగా లుక్ మార్చడం సాధారణమే అయినా, ఎన్టీఆర్ విషయంలో మాత్రం ప్రతి చిన్న మార్పు కూడా పెద్ద చర్చగా మారడం ఆయన క్రేజ్‌కు నిదర్శనం. ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్ తాత్కాలికమయినా, తారక్‌పై అభిమానుల ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.