ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు అగ్ర హీరో ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాకు సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మే నెలలో వెలువడింది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ వారంలోనే ఈ సినిమాను లాంచ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో పాటు హిందీలో ‘వార్-2’లో నటిస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.