Jr.NTR | ఎన్టీఆర్ లైనప్ మామూలుగా లేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా రెండు భాగాలు గా వస్తోంది. ”దేవర కథ రాసుకున్నప్పుడు… ఎన్టీఆర్‌కీ, మా టీమ్ ఈ కథ చెప్పినప్పుడు అందరం ఎంతో ఎక్సయిట్ అయ్యాం. చిత్రీకరణ చేస్తున్నప్పుడు దేవర ప్రపంచం మరింత పెద్దదైంది. ఇలాంటి కథని ఒక్క భాగంలో ముగించడం తప్పు అనుకున్నాం. ఇంత బలమైన పాత్రల్ని, వాటి భావోద్వేగాల్ని పూర్తిస్థాయిలో తెరపైకి తీసుకురావాలంటే రెండు భాగాలుగా ఈ కథని చెప్పాలని మేమంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం” అని తాజాగా కొరటాల ప్రకటించారు.
అయితే దేవర పార్ట్-1 తర్వాత ఎన్టీఆర్ కు మ్యాసివ్ లైనప్ వుంది. దేవర పార్ట్ 1 తర్వాత వార్ 2 లో ప్రాజెక్ట్ ని మొదలుపెడతారు ఎన్టీఆర్. ఇప్పటికే సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటివలే హైదరాబాద్ వచ్చిన చిత్ర దర్శకుడు ఆయన్ ముఖర్జీ ఎన్టీఆర్ తో కలిసి ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న తీరుని వివరించారు. ఇక వార్ 2 సెట్స్ పై ఉండగానే దేవర పార్ట్ 2 పనులు కూడా మొదలౌతాయి. తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా వుంటుంది. దీని తర్వాత కూడా ఎన్టీఆర్ మరో క్రేజీ మూవీ లైన్ లో ఉంచారు.
యష్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్. ఇప్పటివరకూ ఈ స్పై యూనివర్స్ సల్మాన్ , షారుక్, హృతిక్ రోషన్ వున్నారు. ఇప్పుడా యూనివర్స్ లో ఎన్టీఆర్ కూడా చేరుతారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాని నిర్మించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీసు దండయాత్ర చేయడానికి సిద్ధంగా వున్నారు తారక్.