Nana Patekar | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూయడంతో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన హఠాన్మరణం పట్ల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. భారతీయ సినిమాకు నానా పటేకర్ అందించిన అమూల్యమైన సేవలను ఎన్టీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
“భారతీయ చిత్రసీమలోని అత్యుత్తమ నటులలో ఒకరైన నానా పటేకర్ గారి మరణ వార్త విని ఎంతో కలత చెందాను. ఆయన ఏ పాత్ర చేసినా అందులో అద్భుతమైన నిజాయితీ, తీవ్రత కనిపించేవి. ఆయన నటన ఎప్పుడూ కేవలం నటనలా అనిపించకుండా, తెరపై ప్రత్యక్షంగా జీవం ఉట్టిపడుతున్నట్లు ఉండేది” అని ఎన్టీఆర్ కొనియాడారు. భారతీయ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు, సృష్టించిన మరువలేని పాత్రలు తరతరాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని ఎన్టీఆర్ పేర్కొన్నారు. నానా పటేకర్ కుటుంబ సభ్యులకు, ఆయన ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ “ఓం శాంతి” అని సంతాపం తెలిపారు.