Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ దేవర (Devara). జనతా గారేజ్ తర్వాత కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దేవరలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తున్నాడు.
హైదరాబాద్ సమీపంలో వేసిన స్పెషల్ సెట్లో తారక్‌పై వచ్చే సోలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ఇప్పటికే ఓ అప్డేట్ బయటకు వచ్చింది. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా ఆలస్యం కాకుండా.. క్లైమాక్స్ పోర్షన్‌ను కొరటాల టీం ముందుగానే షూట్ చేస్తుందని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్‌పై వచ్చే అండర్‌వాటర్ సీక్వెన్స్‌ను ఈ సెట్లో చిత్రీకరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దేవరకు సంబంధించిన కొత్త అప్డేట్ను అందించి.. మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాడు.
రాత్రి సమయంలో సముద్రంలో వచ్చే భారీ యాక్షన్ సీన్ల షూటింగ్ చేసినట్టు.. లొకేషన్లో తీసిన స్టిల్‌ను షేర్ చేశాడు రత్నవేలు . ఈ అప్డేట్తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దేవరలో చాలా కీలకంగా సాగే ఈ సీక్వెన్స్ కోసం తారక్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడట. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
దేవరలో పాపులర్ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) కీలక పాత్రలో నటిస్తున్నాడు. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
దేవర స్టన్నింగ్ యాక్షన్ అప్డేట్..
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro 🔥director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara 🔥@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
సైఫ్ అలీఖాన్ లుక్..
Team #Devara wishes the powerhouse of talent, the man who oozes sheer brilliance in every role, 𝘽𝙝𝙖𝙞𝙧𝙖 Aka #SaifAliKhan a very Happy Birthday 🔥
The ultimate face-off awaits on the big screens 🌊🙌🏻
In Cinemas 5th April 2024@tarak9999 #KoratalaSiva #JanhviKapoor… pic.twitter.com/7ndKVbTe2D
— NTR Arts (@NTRArtsOfficial) August 16, 2023
దేవర షూటింగ్ అప్డేట్స్..
After a short break and some rehearsals to execute the sequence on a massive scale, we are back on sets from today. 🌊🌊#Devara pic.twitter.com/geCDZmQMYz
— Devara (@DevaraMovie) July 31, 2023
Brace yourself for an adrenaline-fueled cinematic experience! 🌊💥💥💥
Back on sets in a couple of days 🌊 #Devara https://t.co/nvUxrozU3r
— Devara (@DevaraMovie) July 17, 2023
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023
Renowned Action Producer #KennyBates joins the team of #NTR30 & is choreographing major action sequences 🔥
Conceptualization in progess!@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @sabucyril @RathnaveluDop @YuvasudhaArts pic.twitter.com/IfvrNB9v2a
— NTR Arts (@NTRArtsOfficial) March 25, 2023