Devara |జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం దేవర (Devara). టాలీవుడ్ సినీ జనాలతోపాటు గ్లోబల్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. జనతా గారేజ్ తర్వాత కొరటాల-తారక్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తూ.. అభిమానుల్లో జోష్ నింపుతోంది.
తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం స్పెషల్ సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్‌పై వచ్చే అండర్‌వాటర్ సీక్వెన్స్‌ను ఈ సెట్లో చిత్రీకరిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. సినిమాలో చాలా కీలకంగా సాగే ఈ సీక్వెన్స్ కోసం తారక్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. సాంకేతిక నిపుణుల బృందం వీఎఫ్ఎక్స్ పనులు చేసుకునేందుకు తగినంత సమయం ఉండేలా.. డైరెక్టర్ కొరటాల దేవర యాక్షన్ పార్టును పూర్తి చేసే పనిలో ఉన్నాడని సమాచారం.
ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో పాపులర్ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) కీలక పాత్రలో నటిస్తున్నాడు. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న దేవర ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్.
దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి పాపులర్ టెక్నీషియన్ రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023