Devara | ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’పై నిర్మాణం నుంచే భారీ అంచనాలేర్పడ్డాయి. కొరటాల శివ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నది. జాన్వీకపూర్ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో ఎన్టీఆర్ పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఆయుధపూజ..’ అనే పల్లవితో మొదలయ్యే ఈ గీతంలో ఎన్టీఆర్ నృత్యాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని, అభిమానులకు ఓ పండగలా ఈ గీతం ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.
ఈ చిత్రానికి అనిరుధ్ స్వరకర్త. విస్మరణకు గురైన తీరప్రాంతంలో తన వారిని రక్షించుకునే ధీరోధాత్తుడైన యువకుడిగా ఎన్టీఆర్ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.