అక్షయ్‌కుమార్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్డ్రూమ్ కామెడీ డ్రామా ‘జాలీ ఎల్ఎల్బీ’ సిరీస్‌లోని రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మూడో భాగం ‘జాలీ ఎల్ఎల్బీ3’ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకరానుంది. ఈ నేపథ్యంలో సోమవారం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అక్షయ్‌కుమార్, అర్షద్ వార్సీ మధ్య ఉండే వృత్తిపరమైన పోటీని స్ఫురించేలా ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దారు.
మొదటి రెండు భాగాల మాదిరిగానే ఈ మూడోభాగాన్ని కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని, ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుందని అక్షయ్ కుమార్ తన సోషల్‌మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. సుభాష్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.