రాకేష్ వర్రే టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’. విరించివర్మ దర్శకుడు. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాత. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘1980 దశకంలో జగిత్యాల ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కాలేజీ రోజుల నుంచి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, నక్సలైట్లతో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని సినిమాలో ఆవిష్కరించాం. ఆయన రాజకీయప్రస్థానం ఎలా సాగిందన్నది సినిమాలో ఆసక్తికంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాత తెలిపారు. వైశాలిరాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, దర్శకుడు: విరించి వర్మ.