రాకేష్ వర్రే కథానాయకుడిగా రూపొందుతోన్న పొలిటికల్ డ్రామా ‘జితేందర్‌రెడ్డి’. రియా సుమన్ కథానాయిక. విరించి వర్మ దర్శకుడు. ముదుగంటి రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ 1980లో జగిత్యాలలో జరిగిన యథార్థ గాధ ఇది. ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమా చేశాం. నిజాయితీగా తీసిన సినిమా ఇది. విలువలతో కూడిన పాత్రలు ఇందులో కనిపిస్తాయి’ అని చెప్పారు. 1980నాటి లొకేషన్స్‌తోపాటు అప్పటి వాతావరణాన్ని చక్కగా తెరకెక్కించామని, రాకేష్ వర్రేకు హీరోగా మంచి భవిష్యత్తు ఉందని, ఎవరినీ కించిపరిచేలా ఈ సినిమా ఉండదని నిర్మాత తెలిపారు. ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవిప్రకాశ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: గోపీసుందర్.