Khushi Kapoor | బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ అలియాభట్ ‘జిగ్రా’. తమ్ముడికోసం అక్క చేసే పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రానికి వాసన్ బాలా దర్శకుడు. ఇందులో అలియా తమ్ముడిగా వేదాంగ్ రైనా నటించాడు. నిజానికి ఈ సినిమా ఈ నెల 27న విడుదల కావాల్సింది. అయితే.. అదే రోజున ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం విడుదల కానుండటంతో ‘జిగ్రా’ను రెండు వారాలకు పోస్ట్‌పోన్ చేశారు నిర్మాతలు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. ఇదిలావుంటే.. ఈ సినిమా ట్రైలర్‌ను శ్రీదేవి చిన్నకుమార్తె ఖుషీకపూర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నది. హార్ట్ సింబల్తోపాటు ఎమోషనల్ ఫేస్ ఎమోజీలను కూడా ఆ పోస్ట్‌లో పొందుపరిచింది ఖుషి. ఇందులో అలియా తమ్ముడిగా కీలక పాత్ర పోషించిన నటుడు వేదాంగ్ రైనాతో ఖుషి ప్రేమలో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఖుషీ తాజా పోస్ట్ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.