Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో టాప్ హీరోగా ఎదిగారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం ఆయన మనస్తత్వం. ఎప్పుడు కూడా పెద్దగా వివాదాల జోలికి వెళ్లరు. తనని ఎవరైన పొగడడమే తప్ప విమర్శించడం అనేది ఉండదు. చిరంజీవిపై చెత్త చెత్త వార్తలు వస్తే.. మెగా ఫ్యాన్స్ అస్సలు సహించరు. అయితే ఓ సారి గులాబి హీరో జేడి చక్రవర్తి ..చిరంజీవి పెద్ద దుర్మార్గుడు.. రాక్షసుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. జేడీ చక్రవర్తి ఓ మెగా అభిమాని . ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్.
ఆర్జీవీ గ్యాంగ్‌లో జేడీ చక్రవర్తి ఉన్నా కూడా.. అతనికి ఎవరిపైన ప్రేమ, అభిమానం ఉంటే వ్యక్తపరిచే విధానం వేరేలా ఉంటుంది. అప్పట్లో అలీతో సరదాగా షోలో జేడీ చక్రవర్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. చిరంజీవి ఎంత కష్టపడతాడు అని చెప్పడానికి జేడీ చక్రవర్తి కొన్ని పరుష పదాలని ఉపయోగించాడు. ఘరానా మొగుడు సినిమా షూటింగ్ టైంలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ వారంకి పైగా రోజూ షూటింగ్ జరుగుతోందట. అందరూ వస్తున్నారు.. పోతోన్నారు కానీ.. చిరంజీవి మాత్రం షాట్ అయిపోయిన తర్వాత కూడా పక్కనే ఉన్న అంబాసిడర్ కార్లో పడుకుంటున్నాడట. అప్పట్లో కార్వ్యాన్స్ ఉండవు కాబట్టి మేకప్ రూమ్‌లో పడుకునేవారు.
అయితే నేను చిరంజీవి గారిని కార్లో ఎందుకు పడుకున్నారు అని అభిమానిగా ఉండబట్టలేక అడిగాను. అప్పుడు ఆయన సమాధానం ఇస్తూ.. నేను ఒక వేళ మేకప్ రూంలో రెస్ట్ తీసుకుంటే.. నన్ను చిత్రయూనిట్ పిలవదు.. అందుకే ఇక్కడ పడుకున్నాను.. ఇక్కడ ఉంటే డైరెక్టర్ షాట్ రెడీ అంటే నాకు వినిపిస్తుంది.. నేను వెంటనే వెళ్లొచ్చు అని చెప్పారు. ఆయన అంత పని రాక్షసుడు.. దుర్మార్గుడు అంటూ చిరు పడే కష్టం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు జేడి. ఇక జ్వాల సినిమా టైంలోనూ రాళ్లు పగిలే ఎండలోనూ ఎంతో కష్టపడ్డారని, చర్మం కూడా కమిలిపోయిందని అన్నారు. జేడీ గతంలో చేసిన కామెంట్స్‌ని ఇప్పుడు మెగా అభిమానులు నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు.