GaayaPadda Simham | మన గురించి ఆలోచించడానికి కూడా భయపడాలి.. ‘గాయపడ్డ సింహం’ నుంచి స్టన్నింగ్‌గా జేడీ చక్రవర్తి గ్లింప్స్
Gaaya Padda Simham టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న ‘గాయపడ్డ సింహం (GaayaPadda Simham) చిత్రంలో సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి బ్రూతల్ ధర్మ అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. మూవీ నుంచి జేడీ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ వదిలారు మేకర్స్.
GaayaPadda Simham | టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం ‘గాయపడ్డ సింహం (GaayaPadda Simham) ’Don’t Laugh… It’s a Serious Matter అనే ట్యాగ్ లైన్‌తో వస్తోన్న ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి బ్రూతల్ ధర్మ అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. మూవీ నుంచి జేడీ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ వదిలారు మేకర్స్.
సత్య లాజిస్టిక్స్ ఎండీ గురించి ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు అనే డైలాగ్‌తో షురూ అయింది గ్లింప్స్. ఇక బ్రూతల్ ధర్మగా స్టన్నింగ్ ఎంట్రీ ఇచ్చిన జేడీ చక్రవర్తి మన గురించి ఆలోచించడానికి కూడా భయపడాలి అంటూ తనదైన స్టైల్లో చెబుతున్న డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుందని ఇప్పటికే రిలీజైన టైజర్తో హింట్ ఇచ్చేశారు మేకర్స్. వీసా రిజెక్ట్ కావడంతో ఆ యువకుడు ఎదుర్కొనే నిరాశ, ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు కథకు ప్రధానాంశాలుగా ఉంటాయని ట్రైజర్ హింట్ ఇచ్చేస్తుంది. మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు, కేజీఎఫ్ స్పూఫ్ సన్నివేశాలు, అమెరికా వెళ్లకపోయినా హీరో ఇచ్చే బిల్డప్ డైలాగులు వినోదాన్ని పంచుతున్నాయి.
ప్రత్యేకంగా ట్రైజర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సూచించే విధంగా చూపించిన సన్నివేశాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అమెరికా వీసా నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువత ఆవేదనను ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది.
ఈ మూవీ మే 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీలో విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీస్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరణ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Also :
Trisha | త్రిష సైలెంట్ రియాక్షన్ వైరల్ ..రాజకీయ వివాదాల మధ్య లవ్ కోట్స్‌తో సందేశం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

