Jd chakravarthy | సీనియర్ స్టార్‌పై జేడీ సంచలన కామెంట్స్ …ఆ హీరో తాగి అస్సలు టైమ్‌కి రాడంటూ కామెంట్స్..!
Jd chakravarthy | తెలుగు సినీ పరిశ్రమలో ‘శివ’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత ఓ పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తరుణ్ భాస్కర్ హీరోగా, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గాయపడ్డ సింహం సినిమాలో జేడీ కీలక పాత్ర పోషించారు. మే 1, 2026న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Jd chakravarthy | తెలుగు సినీ పరిశ్రమలో ‘శివ’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత ఓ పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తరుణ్ భాస్కర్ హీరోగా, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గాయపడ్డ సింహం సినిమాలో జేడీ కీలక పాత్ర పోషించారు. మే 1, 2026న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో జేడీ ‘బ్రూటల్ ధర్మ’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్‌కు రెండు వేర్వేరు షేడ్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఫస్ట్ హాఫ్‌లో అత్యంత క్రూరమైన విలన్‌గా కనిపించే ఈ పాత్ర, సెకండ్ హాఫ్‌లో పూర్తిస్థాయి కామెడీ వైపు మలుపు తిరిగి ప్రేక్షకులను అలరించనుందని చెప్పారు. “వయలెన్స్ ఎంత ఉన్నా, దాని వెనుక హ్యూమానిటీ కూడా అంతే ఉంటుంది” అని జేడీ వివరించారు.
అయితే సినిమా విశేషాల కంటే కూడా జేడీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక సీనియర్ స్టార్ హీరో గురించి ఆయన చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి. “ఆ హీరో అంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. అందరూ ఆయన్ని గొప్ప వ్యక్తిగా చూస్తారు. కానీ నిజాలు తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను” అని జేడీ అన్నారు. షూటింగ్ సెట్స్‌కు ఆలస్యంగా రావడం వెనుక కారణం గురించి తెలుసుకున్నప్పుడు తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. రాత్రి తాగిన మత్తు దిగలేదని అక్కడి వారు చెప్పడంతో తాను ఆశ్చర్యపోయినట్టు జేడీ తెలిపారు. అంతటి పెద్ద వయసులో కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించడం నన్ను విస్తుపోయేలా చేసిందని జేడీ పేర్కొన్నాడు.
సదరు హీరో తన భార్యతో కాకుండా, తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నారని, తెలిసి తాను షాక్ అయినట్టు జేడీ సంచలన నిజాలు వెల్లడించారు. జేడీ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన చెప్పిన హింట్స్ ఆధారంగా ఆ సీనియర్ స్టార్ ఎవరు అనే దానిపై నెటిజన్లు చర్చలు సాగిస్తున్నారు. దీంతో ‘గాయపడ్డ సింహం’ సినిమాకు విడుదలకు ముందే భారీ పబ్లిసిటీ దక్కింది. మొత్తానికి, సినిమా కథతో పాటు జేడీ వ్యాఖ్యలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రంతో ఆయన మళ్లీ తనదైన ముద్ర వేస్తారా లేదా అన్నది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

