Dayaa| టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ జేడీ చక్రవర్తి (JD Chakravarthy) డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ప్రాజెక్ట్ దయా (Dayaa). పవన్ సాదినేని దర్శకత్వంలో క్రైం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌లో రమ్య నంబీషన్, ఈషా రెబ్బా, కమల్ కామరాజు, విష్ణు ప్రియ కీలక పాత్రల్లో నటించారు. SVF bannerపై మహేంద్ర సోని తెరకెక్కించారు. ఆగస్టు 4 నుంచి డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
విడుదలైన రోజు నుంచి వెబ్ ప్రాజెక్ట్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న జేడీ చక్రవర్తి తన టీంతో కలిసి బెజవాడలో సందడి చేశాడు. బెజవాడ స్క్వేర్ మాల్లో మూవీ లవర్స్, అభిమానుల మధ్య దయా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
దయాలో ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా నటించాడు జేడీ చక్రవర్తి. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ ఓ అమ్మాయి డెడ్ బాడీ చూస్తాడు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పేంత ధైర్యం అతడికి ఉండదు. అతడు మరో బాడీని కూడా చూస్తాడు. ఈ ఘటనలతో డ్రైవర్ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయనే నేపథ్యంలో సాగే సిరీస్ అందరికీ థ్రిల్ అందిస్తూ సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
THE ENERGETIC JD CHEKRAVARTHY lit up the #DAYAA heatwave at the BEZAWADA PVP Square mall!🔥
Watch Now: https://t.co/LZeXHKnEdM#DayaaOnHotstar streaming now, only on #DisneyPlusHotstar.#HotstarSpecials#JDChekravarthy @YoursEesha @nambessan_ramya @kamalkamaraju… pic.twitter.com/BKfr7xvvIn
— BA Raju’s Team (@baraju_SuperHit) August 8, 2023