JayaSudha | తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు అందాల నటి జయసుద. అందం, అభినయంతో తెలుగు వారి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జయసుధ అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి ఎన్టీఆర్‌తోను కలిసి నటించింది. ఐదు దశాబ్ధాలుగా వందలాది చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. టాలీవుడ్లో మూడు తరాల నటులతో కలిసి నటించి అరుదైన ఘనత సంపాదించుకుంది జయసుధ. విజయ నిర్మల – కృష్ణ నటించిన పండంటి కాపురం సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చిన జయసుధ ఈ సినిమాతో ఎంతగానో మెప్పించింది. ఈ సినిమా సమయానికి ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే కావడం గమనార్హం.
అప్పటి నుండి వెనుదిరిగి చూసుకోలేదు జయసుధ. ఈమె ఏడాది తిరగకుండానే స్టార్ అయిపోయింది. పైగా కృష్ణ లాంటి పెద్ద స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండటంతో జయసుధ కెరీర్ పరుగులు పెట్టిందని చెప్పొచ్చు. అయితే ఈ రోజుల్లో స్టార్డమ్ వస్తే నటీమణులు పలు యాడ్స్‌లో నటించడం, షాప్ ఓపెనింగ్స్‌కి వెళ్లడం, సోషల్ మీడియాలో పలు బ్రాండ్స్ ప్రమోట్ చేయడం వంటివి చేస్తున్నారు. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. అయితే అప్పట్లో కమర్షియల్ యాడ్స్ చేయడం ఒక వింత. సావిత్రి వంటి కొందరు నటీమణులు అడపాదడపా ఒకటి అర యాడ్స్ లో నటించేవారు.ఇక జయసుధ కూడా ఓ యాడ్ చేసింది. మరి ఆ యాడ్ మరేదో కాదు లుంగీ యాడ్.
లుంగీ యాడ్‌లో అప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ కనిపించడంతో అంతా షాకయ్యారు. సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ.. శంఖు మార్క్ లుంగీల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. సాధారణ లుంగీల కంటే వీటి రేట్ ఐదు నుంచి, పది రెట్లు ఎక్కువగా ఉండేదట.ఆ బ్రాండ్ ని ఇష్టపడేవారు మాత్రమే ఈ లుంగీలను కట్టేవారు. అయితే ఈ లుంగీల ప్రమోషన్ కోసం హీరోని కాకుండా సదరు కంపెనీ జయసుధ అప్రోచ్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ లుంగీలను ఆడవాళ్లు కూడా కట్టుకునేవారట. అలా వారికి కూడా కంఫర్ట్ గా ఉండేవిధంగా ఈ లుంగీలను తయారు చేసేవారట. అంతేకాదు ఈ లుంగీలను పోటీ పడి కొనుక్కునేవారట. అందుకే అప్పుడు హీరోయిన్లలో యంగ్ సెన్సేషన్‌గా నిలిచిన జయసుధతో ఈ యాడ్ చేయించారట. 1973లో చేసిన ఈ అరుదైన యాడ్ క్లిప్ ఇప్పుడు వైరల్‌గా మారింది.