Siren Movie | తమిళ నటుడు జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సైరన్’ (Siren). అన్నాత్తే, విశ్వాసం, హీరో చిత్రాలకు రచయితగా చేసిన ఆంటోనీ భాగ్యరాజ్(Antony Baghyaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ గమనిస్తే.. అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కొని జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా కనిపించాడు జయం రవి. అయితే అతడు జైలుకు వెళ్లిన అనంతరం అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి.. జయం రవి జైలు నుంచి అనంతరం ఎవరిపై పాగా తీర్చుకోవాలి అనుకుంటాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రంలో జయం రవి, కీర్తి సురేష్తో పాటు, అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగి బాబు, తులసి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ: సెల్వ కుమార్ ఎస్.కె, ఎడిటింగ్: రూబెన్. స్టంట్ కొరియోగ్రఫీ దిలీప్ సుబ్బరాయన్. సుజాత విజయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో థియేటర్లలోకి రానుంది.