బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తోన్న తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత బయోపిక్ తలైవి ట్రైలర్ కు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంప్రెస్ అయ్యాడు.
‘హాయ్ కంగనా కొన్ని ప్రత్యేక సందర్బాల్లో నేను నీతో విభేదించవచ్చు. కానీ తలైవి ట్రైలర్ ను చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది.
సూపర్ డూపర్ స్పెషల్‌గా ఉన్న ట్రైలర్ ను చూసి స్వర్గంలో ఉన్న జయలలిత థ్రిల్ అవుతుంది..’అంటూ వర్మ ట్వీట్ చేశాడు.
దీనిపై కంగనా స్పందిస్తూ..’హాయ్ సర్ నేను ఏ విషయంలో మీతో విభేదించను.
మీరంటే నాకు చాలా ఇష్టం. ఈగోలు, అహంకారాలు తేలికగా దెబ్బతినే ఇలాంటి ప్రమాదకర ప్రపంచంలో మిమ్మల్ని ప్రశంసించాల్సిందే.
ఎందుకంటే మీరు ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు.
మీ గురించి కూడా తేలికగా తీసుకుంటారు. మీ ప్రశంసలకు ధన్యవాదాలు’ అని రీట్వీట్ చేసింది.
Well @KanganaTeam ,anyone with strong opinions is bound to provoke extreme reactions ..I must confess I felt urs a tall claim when u compared with Hollywood greats,but I now apologise and agree 100% that no other actress in the world has ever had ur versatility 💪💐👏 https://t.co/MqGCLHePJK
— Ram Gopal Varma (@RGVzoomin) March 24, 2021