Jawan Movie Teaser | ఎన్నో ఏళ్లుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న షారుఖ్‌కు ‘పఠాన్’ తిరుగులేని విజయాన్నిచ్చింది. రిలీజ్‌కు ముందు మేకర్స్ చేసిన హడావిడితో ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే అనుకుంటే వరుసగా ఐదు రోజులు వంద కోట్లకు తగ్గకుంటా కలెక్షన్లు సాధించి ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. సౌత్‌లో పెద్దగా ఆడకపోయినా.. నార్త్‌లో మాత్రం సంచలనం రేపింది. ఈ సినిమా దాటికి పెద్ద పెద్ద సినిమాలు సైతం పోస్ట్ పోన్ అయ్యాయి. ప్రస్తుతం అదే జోష్‌తో షారుఖ్ ‘జవాన్’ సినిమా పూర్తి చేస్తున్నాడు.
అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా షారుఖ్‌కు మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందంటూ అప్పుడే ట్రేడ్ వర్గాలు చెప్పేశాయి. ఇక ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని షారుఖ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ డేట్‌కు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతంది. ఈ సినిమా టీజర్‌ను జూలై 7న రిలీజ్ చేస్తున్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది. ఆల్మోస్ట్గా ఆ డేట్ కన్ఫర్మ్ అయినట్లే అని ఇన్సైడ్ టాక్.
అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. షారుఖ్‌కు జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తుంది. హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. అట్లీ దర్శకుడు కావడంతో సౌత్‌లోనూ ఈ సినిమాపై మంచి హైపే నెలకొంది. విజయ్ సేతపతి కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.