Jawan Movie Leaked Video | ఎన్నో ఏళ్లుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న షారుఖ్‌కు ‘పఠాన్’ తిరుగులేని విజయాన్నిచ్చింది. రిలీజ్‌కు ముందు మేకర్స్ చేసిన హడావిడితో ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే అనుకుంటే వరుసగా ఐదు రోజులు వంద కోట్లకు తగ్గకుంటా కలెక్షన్లు సాధించి ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. సౌత్‌లో పెద్దగా ఆడకపోయినా.. నార్త్‌లో మాత్రం సంచలనం రేపింది. ఈ సినిమా దాటికి పెద్ద పెద్ద సినిమాలు సైతం పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక ఇటీవలే బాహుబలి పేరిట ఉన్న ఐదేళ్ల రికార్డును బ్రేక్ చేసి హిందీ బెల్ట్‌పై అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.
ఈ ఇచ్చిన సక్సెస్‌తో ‘జవాన్’పై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ ఆరు సెకండ్ల నిడివి ఉన్న వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో నోట్లో సిగరెట్ పెట్టుకుని షారుఖ్ ప్రత్యర్థులతో ఫైటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరీ ఇది సినిమాలోని వీడియోనా.. లేదంటే మరేదైనా వీడియోనా అనేది తెలియాల్సి ఉంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటిస్తుంది. విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ స్వరాలందిస్తున్న ఈసినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీఖాన్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాకు భారీ స్థాయిలో నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. డిజిటల్,శాటిలైట్ హక్కులు కలుపుకుని దాదాపు రూ.250 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.
Make a way y’all Raj Vardhan Thakur is here 🥵 🚬🔥
another all time Blockbuster is coming #Jawan pic.twitter.com/jFSTOFUQtr— Srk (@lovesrkpriyanka) March 10, 2023