సీతారాముల కల్యాణ వైభవం
వేదమంత్రాల సాక్షిగా, మంగళవాయిద్యాల నడుమ జగమంతా పులకించే సీతారాముల కల్యాణ వైభోగం భారతీయుల హృదయాల్లో చెరగని మధురస్మృతి.
వేదమంత్రాల సాక్షిగా, మంగళవాయిద్యాల నడుమ జగమంతా పులకించే సీతారాముల కల్యాణ వైభోగం భారతీయుల హృదయాల్లో చెరగని మధురస్మృతి. ఈ దివ్యమైన వివాహ వేడుకను వెండితెరపై కనువిందు చేసేలా ఆవిష్కరిస్తూ ‘రామాయణ’ చిత్రం నుంచి ‘జతగూడె’ అనే పాటను విడుదల చేశారు. సీతారాముల పాత్రల్లో రణబీర్‌కపూర్, సాయిపల్లవి నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. నితేష్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించారు.
శుక్రవారం విడుదల చేసిన ‘జతగూడె’ పాట సీతారాముల కల్యాణ వైభవాన్ని ఆవిష్కరిస్తూ సాగింది. ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన ఈ గీతానికి రాకేందుమౌళి సాహిత్యాన్ని అందించారు. శిరీష భాగవతుల ఆలపించారు. సీతారాముల వివాహ వేడుకతో పాటు అయోధ్యను దాటి ఈ జంట సాగించిన ప్రయాణానికి సంబంధించిన దృశ్యాలు పాటలో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. సంప్రదాయ వైభవం, ఆధ్యాత్మికత కలబోతగా రామభక్తులను అలరించేలా ఈ పాట సాగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

