సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్ ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. పౌరాణిక ఇతివృత్తాలతో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ సినిమా అందివ్వబోతున్నదని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో ‘సితార’ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు నటి దివ్య ఖోస్లా.
ఆమె లుక్‌ను శనివారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ థియేట్రికల్ రిలీజుల్లో ‘జటాధర’ ఒకటి కానున్నదని, బౌండరీలు చెరిపేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నదని నిర్మాతలు ఉమేష్‌కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా అన్నారు. దేశంలోనే ఓ మైథలాజికల్ ఎపిక్‌గా ఈ సినిమా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.