శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దులు కూతురు జాన్వీ కపూర్ వరుస ఫొటో షూట్స్‌తో ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండీ స్టైల్లోను, సంప్రదాయ దుస్తులలోను ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూ యువతకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా జాన్వీ కపూర్ తళుకు బెళుకులు ఉన్న లెహంగా ధరించి ఎద అందాలతో మైమరపింపజేస్తుంది. జాన్వీని ఇలా చూసి ఆమె అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.
శ్రీదేవి నాలుగేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్గా మారి, తెలుగు, తమిళం,కన్నడ, హిందీ, మలయాళంలో మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించి తిరుగులేని ఇమేజ్‌తో, స్టార్డమ్తో రాణించారు. భారతీయ సినిమా పరిశ్రమలో మొట్ట మొదటి ఫీమేల్ సూపర్‌స్టార్‌గా నిలిచారు. ఇప్పుడు తల్లిని మించిన తనయగా పేరు తెచ్చుకోవాలని జాన్వీ ఎంతగానో ఆరాటపడుతుంది.
జాన్వీ కపూర్ దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వగా, ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో తర్వాతి సినిమాలపై చాలా హోప్స్ పెట్టుకుంది. అవి కూడా నిరాశపరిచాయి. దీంతో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో అట్రాక్ట్ చేస్తుంది. ఇటీవల తన పెళ్లి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్.. పెళ్లి తిరుపతిలో, సంగీత్ వంటి వేడుకలు చెన్నైలోని తమ సొంతింట్లో అని పేర్కొంది.