అనుకున్నదే చేస్తా.. అస్సలు తగ్గనంటున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor | శ్రీదేవి గారాల తనయ జాన్వీకపూర్. అమ్మ ఆశలను, ఆశయాలను భుజాన వేసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సక్సెస్‌ను రుచి చూసింది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.
Janhvi Kapoor | శ్రీదేవి గారాల తనయ జాన్వీకపూర్. అమ్మ ఆశలను, ఆశయాలను భుజాన వేసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సక్సెస్‌ను రుచి చూసింది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. సినిమాలతోపాటు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన జాన్వి ‘షో స్టాపర్’గా అలరించింది.
ఫ్యాషన్ సూత్రాలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. కాలానికి తగ్గట్టుగా వాటిని ఫాలో అవుతుంటాను. వింటేజ్ ఫ్యాషన్ గురించి తెలుసుకుంటూ ఉంటాను. మన శరీరానికి నప్పే దుస్తులే ధరించాలి. మన మూడ్‌ను అవి వ్యక్తం చేసేలా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత ట్రెండీగా కనిపించాలని అనుకున్నా.. పరిధి దాటకుండా చూసుకోవాలి.
నా వస్త్రధారణ ఎవరినో మెప్పించేలా ఉండాలని అనుకోను. నాకు నచ్చినవి, నాకు నప్పినవే ధరించడానికి ఇష్టపడతాను. ఈ విషయంలో మా చెల్లి, డిజైనర్ కూడా పెదవి విరుస్తుంటారు. నేను మాత్రం అస్సలు తగ్గను. అనుకున్నదే చేస్తాను. ఈ విషయంలో అమ్మ పోలికే.
నా చెల్లెలు ఖుషీతో సమయం గడపడం అంటే ఇష్టం. ప్రస్తుతం తను మొదటి సినిమాతో బిజీగా ఉంది. షూటింగ్ లేకపోతే మాత్రం నా దగ్గరికి వచ్చేయమని చెబుతాను. తను చాలా కష్టపడుతున్నది. మంచి స్టార్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా.
నేను ఎలాంటి పాత్రలు చేయాలో ప్రేక్షకులే చెబితే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఏ పాత్ర చేసినా ప్రేక్షకుల అభిమానం పొందాలనే ప్రయత్నిస్తాం. నేను ఎలాంటి పాత్ర అయినా చేయగలననే నమ్మకం వారికి కలగాలి. కామెడీ తరహా పాత్రలు పోషించాలి. నా చిత్రాల్లో డ్యాన్సూ ఉండాలి. ఇదే నా కోరిక.
జూనియర్ ఎన్టీఆర్‌కు నేను బిగ్ ఫ్యాన్. ఆయనతో కలిసి సినిమా చేయాలని ఉంది. అలాగే అల్లు అర్జున్, మహేశ్‌బాబు, విజయ్ సేతుపతి.. వీరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. అవకాశం వస్తే తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తాను.
రీల్ లైఫ్‌లో డైరెక్టర్ చెప్పినట్లు నడుచుకుంటాను. అది నా ప్రొఫెషన్ కాబట్టి.. నిర్లక్ష్యం దరిచేరనీయను. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటాను. చిన్నచిన్న విషయాలకే తెగ సంబరపడిపోతాను. మంచి సినిమా చూస్తే ఆ పూటంతా సంతోషంలో మునిగి పోతాను. నాన్నతో, చెల్లితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటాను.
Read More :
“Janhvi Kapoor | గోల్డెన్ కలర్ డ్రెస్‌లో ఒకేలా అల్లు స్నేహ, జాన్వీకపూర్”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

