స్టార్ హీరో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ (Allu Sneha) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందని తెలిసిందే. ఈ బ్యూటీ ఇటీవలే రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ది ట్రీ ఆఫ్ కలెక్షన్లో భాగంగా గోల్డ్ డ్రెస్లో హొయలు పోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ స్టిల్స్ ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
కాగా బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) కూడా ఇలాంటి డ్రెస్ (త్రోబ్యాక్ లుక్)లోనే కనిపిస్తూ .. నెటిజన్లను ఆకర్షిస్తోంది. నెటిజన్లు, బన్నీ అభిమానులు ఒకే డ్రెస్లో ఉన్న ఈ ఇద్దరు భామల ఫొటోలను పోలుస్తూ.. ఇద్దరూ ఎవరికివారే స్టన్నింగ్ లుక్లో కనిపిస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవలే మిలి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది జాన్వీకపూర్. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో నటిస్తోంది.
Styled by: @PJukalker
Outfit: @RahulMishra_7
📸: #storiesbyjosephradhik
📿: #VasundharaDiamondsrf pic.twitter.com/XNzlG1rnrm— Allu Sneha Reddy (@AlluSnehaReddy_) November 19, 2022