ముంబై: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. తనకు ఇష్టమైన రెండు విషయాలను చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ ఫుల్ జోష్‌లో ఉండే జాన్వీ.. తాజాగా కొత్త ఫోటోలను అప్లోడ్ చేసింది. ఇక తనకు ఇష్టమైవేంటో కూడా చెప్పింది జాన్వీ. కెమెరా ముందు ఫోజులివ్వడం.. స్టేజ్‌పై షో చేయడం తనకు నచ్చిన రెండు అంశాలని జాన్వీ పేర్కొన్నది.
క్యాప్షన్‌తో పాటు తన ఇన్‌స్టాలో జాన్వీ చాలా ఫోటోలను పోస్టు చేసింది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు షోలో పాల్గొన్న ఆ ఫోటోల్లో జాన్వీ కేక పుట్టిస్తోంది. షోకు రెఢీ అవుతున్న సమయంలో దిగిన ఫోటోలను కూడా ఆ బ్యూటీ పోస్టు చేసింది. షార్ట్స్, నైట్షర్ట్ వేసుకున్న ఫోటోలో జాన్వీ యమ క్రేజీగా ఉంది. ఆ ఫోటోను ఎవరూ మిస్ కావొద్దు.
ఫోటోలకు చివరన ఓ వీడియోను పోస్టు చేసింది జాన్వీ. గ్రీన్, రెడ్ దుస్తుల్లో కెమెరా ముందు స్టెప్పులేసింది. జాన్వీ సోదరుడు అర్జున్ కపూర్ కూడా ఆ వీడియోలో కనిపించాడు. దుబాయ్‌లో జరిగిన షోలో గౌన్‌లో దిగిన ఫోటోలను కూడా జాన్వీ షేర్ చేసింది. ఆ ఫోటోలకు ఆమె బాయ్‌ఫ్రెండ్ ఒర్హన్ అవత్రమని యా అల్లా అంటూ కామెంట్ చేశాడు.