Janhvi kapoor in Akhil movie | ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన అఖిల్ ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కోసం అఖిల్ తన దేహాన్ని సానపెట్టాడు. ఇదివరకే మేకర్స్ అఖిల్ ఫోటోలను విడుదల చేశారు. 6 ప్యాక్ బాడీతో కండలు తిరిగిన దేహంతో అఖిల్ మాస్ మేకోవర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైయ్యాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
ఈ చిత్రం తర్వాత అఖిల్ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కతున్నట్లు టాక్. బాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు టాక్. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడిగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. జాన్వీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. గతంలోనే జాన్వీ కాపూర్ టాలీవుడ్ నుంచి తన దగ్గరకు వచ్చిన కథలలో ఏ ఒక్కటి నచ్చలేదు అని తెలిపింది. అప్పట్లో అది బాగా వైరల్ అయ్యింది. ఈ విషయంపై తెలుగు ప్రేక్షకులు జ్వాన్వీని ఒక రేంజ్లో ట్రోల్స్ చేసారు.