లాస్ ఏంజిల్స్ : ప్రతిష్టాత్మక ఆస్కార్స్(Oscars) వేడుక ఇవాళ లాస్ ఏంజిల్స్ లో కలర్ఫుల్గా జరిగింది. కానీ ఆ ఈవెంట్‌కు మేటి డైరెక్టర్ జేమ్స్ కెమరూన్(James Cameron) డుమ్మా కొట్టారు. ఆయన తీసిన అవతార్ 2కు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవార్డు వచ్చింది. కానీ ఆయన అవార్డు ఫంక్షన్‌కు రాకపోవడానికి కారణం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. డిస్నీకి చెందిన అవతార్2(Avatar 2) మొత్తం నాలుగు కేటగిరీల్లో పోటీపడింది. బెస్ట్ పిక్చర్ విభాగంలోనూ ఆ సినిమా ఉంది. కానీ బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో మాత్రం జేమ్స్ కెమరూన్ లేరు. అయితే ఆ కేటగిరీకి నామినేట్ చేయకపోవడం వల్లే ఆయన ఈయేటి ఆస్కార్స్ వేడుకకు దూరంగా ఉన్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. కానీ ఆస్కార్స్‌కు నామినేట్ అయిన వారితో గత వారం జరిగిన విందులో మాత్రం జేమ్స్ కెమరూన్ పాల్గొన్నారు.
ఇక ఈసారి ఆస్కార్స్‌కు దూరంగా ఉన్న టాప్ హీరోల్లో టామ్ క్రూజ్(Tom Cruise), డెంజిల్ వాషింగ్టన్(Denzil Washington) ఉన్నారు. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో నటిస్తున్న టామ్ క్రూజ్.. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నారు. దీంతో ఆయన ఈ అవార్డులకు డుమ్మాకొట్టినట్లు తెలుస్తోంది. టాప్ గన్ చిత్రం ఈసారి ఆరు అవార్డుల కోసం నామినేట్ అయ్యింది. ఇక మూడు సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న డెంజిల్ వాషింగ్టన్ .. బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
95వ అకాడమీ అవార్డులకు హోస్ట్‌గా వ్యవహరించిన జిమ్మీ కిమ్మల్(Jimmy Kimmel) వేదికపై ఓ జోకేశారు. కెమరూన్ ఎందుకు అవార్డు ఫంక్షన్‌కు రాలేదో తనదైన స్టయిల్లో చెప్పి నవ్వించారు.
While poking fun at James Cameron, Jimmy Kimmel jokes about the lack of female director nominees at the #Oscars:
“How does the Academy not nominate the guy who directed ‘Avatar’? What do they think he is? A woman?” pic.twitter.com/Iqh9g0vSr0
— The Recount (@therecount) March 13, 2023