Bhola Shankar | అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మోహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘జామ్ జామ్ జజ్జనక’అనే పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది ‘భోళాశంకర్’ గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్.
హుషారైన బీట్తో సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ ఈ గీతాన్ని స్వర పరిచారు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఈ పాటలో మెగాస్టార్ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా అలరిస్తాయి. చిరంజీవితో పాటు తమన్నా, కీర్తిసురేష్, సుశాంత్‌లు ఈ పాటకు ఆకర్షణగా నిలుస్తారు. ఆగస్టు 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి డైలాగ్స్: తిరుపతి మామిడాల.