Jailer Movie Update | సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తమిళనాట ఎంత క్రేజ్ ఉందో తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంది. కోలీవుడ్‌లో ఆయన సినిమాలకు ఎలాంటి సెలబ్రెషన్స్ జరుగుతాయో.. ఇక్కడ కూడా అదే రేంజ్లో సెలబ్రెషన్స్ జరుగుతాయి. రజనీ సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలెబ్రిటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అయితే ప్రస్తుతం రజనీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. నిజానికి ‘రోబో’ తర్వాత ఇప్పటివరకు రజనీకు ఆ స్థాయి హిట్టు లభించలేదు. మధ్యలో బాగా హైప్‌తో రిలీజైన ‘కబాలి’, ‘2.0’, ‘పేట’ సినిమాలు బాగానే ఆడినా రజనీ స్థాయిలో హిట్టవ్వలేకపోయాయి. ప్రస్తుతం రజనీకాంత్ ఆశలన్నీ ‘జైలర్’ సినిమాపైనే ఉన్నాయి.
‘బీస్ట్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత నెల్సన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా సోమవారం తలైవా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలో రజనీ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముత్తువేల్ పాండియాన్ సాయంత్రం 6గంటలకు వచ్చేస్తున్నాడు అంటూ చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Muthuvel Pandian arrives at 12.12.22 – 6 PM😎
Wishing Superstar @rajinikanth a very Happy Birthday!@Nelsondilpkumar @anirudhofficial #Jailer#SuperstarRajinikanth #HBDSuperstar #HBDSuperstarRajinikanth pic.twitter.com/ocF0I7ZPEi— Sun Pictures (@sunpictures) December 11, 2022